గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,286-0.13%
NIFTY22,486-0.31%
22K₹1,38,142/10g+0.05%
భాషలు

సినిమా

జాతీయ అవార్డులు అందుకున్న ‘కల్కి 2898 ఏడీ’

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులని అందుకున్న ‘కల్కి 2898 ఏడీ 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇండియన్ స్క్రీన్స్ పై బిగ్గెస

Staff Reporter23 September 2026, 10:32 AM5 చూసులుtrinetnews.com
జాతీయ అవార్డులు అందుకున్న ‘కల్కి 2898 ఏడీ’

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులని అందుకున్న ‘కల్కి 2898 ఏడీ

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇండియన్ స్క్రీన్స్ పై బిగ్గెస్ట్ హిట్‌గా చరిత్ర సృష్టించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి రెండు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు లభించాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు దక్కింది. అలాగే సినిమాకు అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించిన ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానికి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డు లభించింది.

చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీదత్, స్వప్నదత్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని అవార్డులు అందుకున్నారు.

భారీ కాన్వాస్‌పై, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు దక్కడం వైజయంతీ మూవీస్‌కు మరో ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది.

దర్శకుడు నాగ్ అశ్విన్ తన యూనిక్ విజన్‌తో క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ ప్రపంచం, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, సాంకేతిక నైపుణ్యం, నటీనటుల ప్రతిభకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయి.

దశాబ్దాలుగా భారతీయ సినీ రంగంలో వైజయంతీ మూవీస్ తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. ప్రతిష్ఠాత్మక చిత్రాలను నిర్మిస్తూ, కొత్త కథలను అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో సంస్థ ఎప్పుడూ ముందుంటోంది. ఈ క్రమంలో ‘కల్కి 2898 ఏడీ’కి రెండు జాతీయ అవార్డులు రావడం సంస్థ ప్రయాణంలో మరో గర్వకారణమైన అధ్యాయంగా నిలిచింది.

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికపై ‘కల్కి 2898 ఏడీ’ టీమ్ అవార్డులు అందుకున్న ఈ ప్రత్యేకమైన క్షణాలు సినీ అభిమానులకు కూడా మెమరబుల్ గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →