గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,286-0.13%
NIFTY22,486-0.31%
22K₹1,38,142/10g+0.05%
భాషలు

సినిమా

'తత్వం' క్లైమాక్స్‌ను ఎవరూ గెస్ చేయలేరు: హీరో దినేష్ తేజ

'తత్వం'లో క్లైమాక్స్‌ను ఎవరూ గెస్‌ చేయలేరు: హీరో దినేష్‌ తేజ అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో

Staff Reporter4 October 2026, 4:19 PM8 చూసులుtrinetnews.com
'తత్వం' క్లైమాక్స్‌ను ఎవరూ గెస్ చేయలేరు: హీరో దినేష్ తేజ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

'తత్వం'లో క్లైమాక్స్‌ను ఎవరూ గెస్‌ చేయలేరు: హీరో దినేష్‌ తేజ

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మర్డర్‌ మిస్టరీ జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లేతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం 'తత్వం'. ఇటీవల విడుదల ఈ చిత్రం ట్రైలర్‌కు, పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. రేపు చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దినేష్‌ తేజ బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు. థ్రియేటికల్‌ విడుదలకు సిద్దమైంది.

తత్వం సినిమాను ఒప్పుకోవడానికి రీజన్‌ ఏమిటి?

ఈ సినిమాలో ఎవరూ గెస్‌ చేయలేని ట్విస్ట్‌లు.. క్లైమాక్స్‌లో ఉండే ఎమోషన్‌.. తనకు తాను ఏమీ తెలుసుకున్నాడు తనకు ఏమీ తత్వం బోదపడింది అనే పాయింట్‌తో పాటు టోటల్‌ ఈ మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ కొత్తగా అనిపించింది. రేపు థియేటర్‌లో జనాలు కూడా అదే ఫీలవుతారు.

ఇది ఎలాంటి కథ?

మూడనమ్మకంకు నమ్మకం మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. దాని చుట్టే ఈ కథ తిరగుతుంది. 2000వ సంవత్సరంలో నడిచే కథ ఇది.

ఈ సినిమా సమయంలో మీకు యాక్సిడెంట్‌ జరిగిందని తెలిసింది?

ఈ సినిమాకు జరిగిన నెగెటివ్‌లతో అన్నీ ఈ సినిమాకు దిష్టి పోయింది అనుకుంటున్నాం. మా సినిమా కంటెంట్‌ చాలా గట్టిది. ఈ సినిమా ప్రమోషన్‌ టైమ్‌లో నాకు హీరోయిన్‌కు యాక్సిడెంట్ జరిగింది. నాకు ఇది సెకండ్‌ లైఫ్‌. డే వన్‌ రోజు కథ విన్నప్పుడు నాలో ఎలాంటి నమ్మకం ఉందే ఈ రోజుకు అంతకు మించి ఈ చిత్రం విజయంపై విశ్వాసం ఉంది. ఆడియన్స్‌కు సినిమా తప్పకుండా నచ్చుతుంది. అందరూ నన్ను నీ ఫ్రైడే ఎప్పుడూ నీ టైమ్‌ ఎప్పుడూ అంటుంటారు.. తప్పకుండా ఈసినిమాతో ఆ రోజు వస్తుంది. నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ మంచి సినిమాల్లో నటిస్తాను. కొత్తదనం ఉన్న సినిమాలు తెలుగు ఆడియన్స్‌ ఆదరిస్తుంటారు. తప్పకుండా ఈ సినిమాను కూడా అదే కోవలో విజయాన్ని ఇస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమాకు కథే మా ధైర్యం, ఆడియన్సే మా బలం. ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే మా అందరిలో కూడా నమ్మకం కలుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ అందరి మనసులను తాకుతుంది

మీరు ఎదురుచూస్తున్నకమర్షియల్‌ సక్సెస్‌ ఈ సినిమాతో వస్తుందని అనుకుంటున్నారా?

కమర్షియల్‌ సక్సెస్‌ ఒక్కటే చూడటం లేదు. కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు. ఈ కథ చెప్పాలని అనిపించి చేసిన సినిమా. ఇది కూడా నావెల్టీ కథ కాబట్టి చేశాను. ఇది నటుడిగా నాకు పూర్తి సంతృప్తి నిచ్చిన సినిమా ఇది. ఇలాంటి కథలు చేయడం వల్ల ఆడియన్స్‌లో మంచి రెస్పెక్ట్‌ వస్తుంది.

మీకు ఈ సినిమాలో పాత్ర పర్సనల్‌గా ఎంత వరకు శాటిస్‌ఫాక్షన్‌ ఇచ్చింది?

పర్సనల్‌గా నేను ఏ రోల్‌ చేసిన పూర్తి సంతృప్తిగానే చేస్తాను. హాండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేస్తాను.

వెబ్‌సీరిస్‌లు ఒప్పుకోవడం లేదా?

ఓటీటీ వెబ్‌సీరిస్‌ ఆఫర్లు వచ్చాయి. అంత శాటిస్‌ఫాక్షన్‌ కథలు రాలేదు. అందుకే ఒప్పుకోలేదు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?

హుషారు -2తో పాటు విజయనగరం బ్యాక్‌డ్రాప్‌తో ఓ యాక్షన్‌ డ్రామా చేశాను. సతీష్ వెగేశ్న కథా కేళి ఉంది

తత్వంతో మీకు ఎలాంటి గుర్తింప వస్తుందని అనుకుంటున్నారు?

ఈ సినిమా తరువాత కొత్త కథలతో వచ్చే రచయితలకు నేను కూడా ఒక ఆప్షన్‌గా ఉంటాననే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ఫేస్‌ చేసిన స్ట్రగుల్స్‌ ఏ సినిమాకు ఫేస్‌ చేయలేదు.. దర్శక, నిర్మాతలు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ సినిమాను ఈ స్టేజ్‌ వరకు తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →