గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,267-0.16%
NIFTY22,482-0.33%
22K₹1,38,118/10g+0.04%
భాషలు

సాంస్కృతికం

రవీంద్రభారతిలో ఆకట్టుకున్న ‘ఎరుక’ నాటిక ప్రదర్శన

ఆకట్టుకున్న ‘ఎరుక’ నాటిక ప్రదర్శన రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ 25: ప్రముఖ రచయిత మాడభూషి దివాకరబాబు రచించిన ‘ఎరుక’ నాటిక రవీంద్రభారతిలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సామాజిక స్పృహను, మానవీయ విలువలను ప్రతిబింబించేలా

Staff Reporter25 September 2026, 1:13 PM7 చూసులుtrinetnews.com
రవీంద్రభారతిలో ఆకట్టుకున్న ‘ఎరుక’ నాటిక ప్రదర్శన

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఆకట్టుకున్న ‘ఎరుక’ నాటిక ప్రదర్శన

రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ 25: ప్రముఖ రచయిత మాడభూషి దివాకరబాబు రచించిన ‘ఎరుక’ నాటిక రవీంద్రభారతిలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సామాజిక స్పృహను, మానవీయ విలువలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ఈ నాటికలో ఆచార్య కోట్ల హనుమంతరావు ప్రధాన పాత్రలో నటించి తన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా కుమారి కోట్ల సన్నిధి ఎలుక పాత్రలో లీనమై, పాత్రకు జీవం పోస్తూ.. అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఆమె హావభావాలు, సంభాషణల పలుకుబడి, పాత్రలోని భావోద్వేగాలను ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కార్యక్రమానికి తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ప్రముఖ దర్శకుడు రేలంగి నర్సింగరావు, ఆచార్య అలేఖ్య, డీసీఎన్ మూర్తి తదితర ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఎరుక’ నాటికలోని సామాజిక అంశాలను, రచయిత మాడభూషి దివాకరబాబు రచనా ప్రతిభను ప్రశంసించారు. సమాజంలో మారుతున్న విలువలు, మానవ సంబంధాలు, వ్యక్తి బాధ్యతలను నాటిక ద్వారా చక్కగా ఆవిష్కరించారని పేర్కొన్నారు.

సాహిత్యం, నాటకరంగం, సమాజం మధ్య ఉన్న అనుబంధాన్ని చాటిచెప్పేలా ‘ఎరుక’ ప్రదర్శన సాగింది. నాటిక ముగిసిన అనంతరం ప్రేక్షకులు కళాకారులకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా కుమారి కోట్ల సన్నిధి ఎలుక పాత్రలో చూపిన ప్రతిభకు విశేష స్పందన లభించింది.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →