గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,267-0.16%
NIFTY22,482-0.33%
22K₹1,38,118/10g+0.04%
భాషలు

సంపాదకీయం

జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనిక

Staff Reporter21 September 2026, 3:35 PM15 చూసులుtrinetnews.com
జీవితాన్ని ఒక లక్ష్యంతో జత కలపండి - విజయానికి అదే బాట

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

*జీవితాన్ని లక్ష్యంతో జత కలుపు*

డాక్టర్ గారి గది ప్రశాంతంగా ఉంది. తన భర్త ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ గారు ఏం చెప్తారో అని భార్య మనసులో ఆందోళనగా ఉంది. "మేము చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేసాము. మరో గంట సమయం తప్ప అతనికి ఇంకేం లేదు. తెలిసినవాళ్లు అందరినీ పిలిపించుకోండి" అని డాక్టర్ గారు చెప్పేసారు.

వెంటనే తన భర్త ఉన్న గదిలోకి వెళ్లి బాధలో మౌనంగానే అతన్ని చూస్తూ ఉంది. "అతనికి ఇక సమయం లేదు" అన్న విషయం ఆమె చూపులో అర్థమైన ఆ భర్త ఆలోచనల్లో పడ్డాడు.

"చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లి, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని బాగా చదువుకొని ఉండాల్సింది. ఆ సమయంలో స్నేహితులంటూ, సరదాలంటూ తండ్రి చెప్పినా వినకుండా సమయాన్ని వృధా చేశాను. దానివల్ల చదువుపై పట్టు సాధించలేకపోయాను. బాగా చదువుకొని ఉంటే ఒక ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదించగలిగి ఉండేవాణ్ణి. ఇప్పుడు అలాంటి ఉద్యోగం సాధించాలన్నా కూడా చదవాల్సిన నా బాల్యాన్ని మళ్ళీ పొందలేను. నా పిల్లలను ఒక మంచి పాఠశాలలో చదివించడానికి అవసరమైన ఫీజులను కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే కానీ ఇల్లు నడవని పరిస్థితి ఏర్పడింది. చదువు వదిలేసి ఏ స్నేహితులంటూ తిరిగానో ఇప్పుడు వారు ఎవరూ కూడా నా కుటుంబాన్ని ఆదుకోవడానికి నా పక్కన లేరు. శ్రద్ధగా చదవాల్సిన సమయంలో సరదాలు అంటూ చదువును పక్కన పెట్టేశాను. ఇప్పుడు సరదాగా కుటుంబంతో గడపాల్సిన సమయంలో ఇల్లు నడపడానికి చెమటోడ్చాల్సి వస్తుంది. నా పిల్లలకు ఒక తండ్రిగా నేను అందించాల్సిన మంచి చదువు, మంచి బట్ట, రక్షణ ఇవన్నీ సరిపడినంతగా అందించలేకపోవడం నా నిర్లక్ష్యమే కదా" అంటూ తనలో తనే బాధపడుతున్నాడు.

"కానీ ఇప్పుడు చేసేది ఏమీ లేదు. ఇంకాసేపట్లో నా ఈ జీవితం ముగిసిపోతుంది కదా ఎలాగూ" అని మౌనంగా తన నిర్లక్ష్యానికి ప్రాయశ్చిత్తంగా తన కోసం ఇన్నాళ్లు పనిచేసిన ఆ గుండెని కన్నీళ్లతో క్షమాపణ కోరుతున్నాడు.

ఇప్పుడు అతడు ఎంత బాధపడినా పోయిన కాలం తిరిగి రాదు, పోయే ప్రాణమూ ఆగదు.

ఈ సందర్భం "జుట్టు మొత్తం రాలిపోయిన తర్వాత దువ్వెన చేతిలోకి తీసుకున్నట్టుగా" ఉంది. అందుకే ఏ సమయంలో ఏ బాధ్యత నెరవేర్చాలో దానిని చక్కగా నిర్వర్తించాలి. ఒక వస్తువు పోతే మళ్ళీ కొనుక్కోగలవేమో కానీ జీవితం పూర్తయిపోతే మళ్లీ తిరిగి తెచ్చుకోలేము. పోయిన కాలాన్ని వెనక్కి తిప్పి, జీవితంలో చేసిన పొరపాట్లను, నిర్లక్ష్యాన్ని మళ్ళీ మార్చి సరి చేయలేము.

కాబట్టి చదువుకునే వయసు నుండే జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉండాలి. మన పూర్తి జీవితాన్ని ఒక లక్ష్యానికి జత చేయాలి. ఆ లక్ష్యం కోసం అడుగులు వేస్తూ జీవితాన్ని సార్థకం చేయాలి. దారం తెగిన గాలిపటం ఏ లక్ష్యము లేకుండా ఎగిరినట్టు ఏదో తోచిన పని చేస్తూ సుమారు 60 లేదా 70 సంవత్సరాలు జీవితాన్ని వృధా చేయకూడదు.

"ఒకేలా ఆలోచిస్తూ, ఒకేలా పనిచేస్తూ ఒక 75 సంవత్సరాలు గడిపేసి దానికి "జీవితం" అని పేరు పెట్టుకోవద్దు" అని ప్రముఖ రచయిత రాబిన్ శర్మ గారి వాక్యం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అంటే మన ఆలోచనలో ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాలి, ఏది సరైనది, ఏది తప్పు అనే విచక్షనాత్మక ఆలోచన అలవర్చుకోవాలి.

మన జీవితంలో మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. పాఠశాల దశలో తరగతిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా విని, పరీక్షల్లో మంచి మార్కులు సాధించి, సంబంధిత జ్ఞానం పట్ల మంచి పట్టు కలిగి ఉండాలి, నచ్చిన ఒక వృత్తిని ఎంచుకొని, దాన్ని సాధించే క్రమంలో నిపుణుల సలహాలతో ఒక ప్రణాళిక రచించాలి. ఎటువంటి నిరాశ నిస్పృహ లకు లోనవ్వకుండా, మన ప్రణాళిక ప్రకారం మనం అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు కష్టపడాలి,

అలా ఒక లక్ష్యం నిర్ధారించుకొని దానికోసం పనిచేయడం అనేది మన జీవితానికి ఒక విలువనిస్తుంది. మనల్ని గమనించే చుట్టూ ఉన్న పదిమందికి స్ఫూర్తినిస్తుంది.

చేసే వృత్తిలో ఒక నైపుణ్యతని ప్రదర్శించాలి. ఆ వృత్తిలో కూడా మరింత నేర్చుకునేందుకు, మరింత ఎదిగేందుకు ఉపయోగపడేలా మన ఆలోచన, ప్రవర్తన ఉండాలి.

*చివరిగా ఒక్క మాట:*

జీవితం అయిపోయే చివరి దశలో "నేను అలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండాల్సింది" అంటూ ఒక నిరాశ మన ఆలోచనలో ఉండకూడదు. "నేను అనుకున్న లక్ష్యం కోసం కష్టపడ్డాను, నేను అనుకున్నట్టుగా ఉండడానికి చేయవలసిన కృషి చేశాను. పదిమందిని నవ్వించగలిగాను, 10 మందికి స్ఫూర్తినివ్వగలిగాను" అంటూ ఒక సంతృప్తితో గుండెల మీద చేయి వేసుకునే క్షణాలు ఉండాలి. దానికోసం మన జీవితం మొదటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం ఒక లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉండాలి.

M. Jaya Krishna Reddy

M.S. (Counselling and Psychotherapy)

Motivational Speaker

Cell: 9640215541

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →