Thursday8 October 2026Hyderabad

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,866/10g-0.19%
Languages

Latest News

19 నుండి 23 వరకు శిల్పారామంలో పూంపుహార్ “మెగా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్‌పో”

nagendra17 September 2026, 11:37 PM2 viewstrinetnews.com
19 నుండి 23 వరకు శిల్పారామంలో పూంపుహార్ “మెగా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్‌పో”

Share this story

Share link keeps your language (?lang=)

19న ప్రారంభించనున్న తమిళనాడు సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పి. మధన్ రాజా

తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (పూంపుహార్) అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్) సి. గోపికన్నన్

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 17: :

ఈ నెల 19 నుండి 23 వ తేదీ వరకు శిల్పారామంలో పూంపుహార్ పేరుతో “మెగా హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్‌పో” నిర్వహిస్తున్నట్లు

తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (పూంపుహార్) అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్) సి. గోపికన్నన్ వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ అయిన తమిళనాడు హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ “పూంపుహార్” పేరుతో 19 నుండి 23 వరకు శిల్పారామంలో “మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో” లో తమిళనాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులు తయారు చేసిన అనేక రకాల అద్భుతమైన హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఈ ప్రదర్శన ద్వారా తమిళనాడు వైవిధ్యమైన సాంప్రదాయ హస్తకళా వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేయడం జరుగుతుందని వివరించారు. ఈరోజు ఆయన విడుదల చేసిన ప్రకటన లో ఈ ప్రదర్శనను తమిళనాడు ప్రభుత్వ సూక్ష్మ, చిన్న , మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పి. మధన్ రాజా 19 న ఉదయం గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. అమృత జ్యోతి హాజరు కానున్నారు. ఈ ప్రదర్శనలో కాంస్య విగ్రహాలు, ఇత్తడి సంప్రదాయ దీపాలు, తంజావూరు చిత్రాలు, తంజావూరు ఆర్ట్ ప్లేట్లు, పేపియర్-మాచే బొమ్మలు, చెక్క శిల్పాలు, రాతి శిల్పాలు, ఇత్తడి కళాఖండాలు, మట్టి మరియు టెర్రకోట ఉత్పత్తులు, చెరకు/కేన్ ఫర్నిచర్, అరటి నార ఉత్పత్తులు, జనపనార (జ్యూట్) ఉత్పత్తులు, తాటి ఆకుల ఉత్పత్తులు, ఫ్యాషన్ ఆభరణాలు, ధూప ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, చేతితో తయారు చేసిన వస్త్రాలు , చేనేత ఉత్పత్తులు, తదితర అనేక సాంప్రదాయ హస్తకళా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (పూంపుహార్) అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్) సి. గోపికన్నన్ వివరించారు.

Also read