Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,057/10g+1.42%
भाषाएँ

Latest News

జాతీయ రహదారులపై వన్యప్రాణుల రక్షణకు ప్రాధాన్యం ఐదేళ్లలో రూ.19,700 కోట్ల పెట్టుబడులు

nagendra9 October 2026, 2:34 AM3 व्यूtrinetnews.com
జాతీయ రహదారులపై వన్యప్రాణుల రక్షణకు ప్రాధాన్యం ఐదేళ్లలో రూ.19,700 కోట్ల పెట్టుబడులు

Share this story

Share link keeps your language (?lang=)

దేశవ్యాప్తంగా నిర్మించిన లేదా ప్రతిపాదించిన రక్షణ నిర్మాణాలు 2,150కి పైగా

న్యూ ఢిల్లీ, అక్టోబర్‌ 8, ట్రైనెట్ న్యూస్: జాతీయ రహదారుల అభివృద్ధిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ‘వైల్డ్‌లైఫ్‌ మిటిగేషన్‌ మెజర్స్‌ అండ్‌ స్ట్రక్చర్స్‌’ పత్రాన్ని విడుదల చేసింది. అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు నిర్వహించిన జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను పురస్కరించుకుని రూపొందించిన ఈ పత్రాన్ని గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో ఇటీవల జరిగిన చింతన్‌ శిబిర్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆవిష్కరించారు.

గత ఐదేళ్లలో జాతీయ రహదారి ప్రాజెక్టుల్లో వన్యప్రాణుల రక్షణకు అవసరమైన మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై సుమారు రూ.19,700 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. రహదారుల వల్ల జంతువుల ఆవాసాలు విడిపోవడం, సంచారానికి అడ్డంకులు ఏర్పడటం, వాహనాలతో ఢీకొనే ప్రమాదాలను తగ్గించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యమని పేర్కొంది.

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 2,150కి పైగా వన్యప్రాణుల రక్షణ నిర్మాణాలను నిర్మించినట్లు లేదా ప్రతిపాదించినట్లు పత్రం వెల్లడించింది. వీటిలో జంతువుల అండర్‌పాస్‌లు, ఓవర్‌పాస్‌లు, వంతెనలతో అనుసంధానించిన జంతు మార్గాలు, వన్యప్రాణుల సంచారానికి అనువుగా మార్చిన కల్వర్టులు, చెట్లపై సంచరించే జీవుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక మార్గాలు ఉన్నాయి.

నిర్మాణాత్మక చర్యల్లో భాగంగా జంతువుల అండర్‌పాస్‌లకు సుమారు రూ.4,600 కోట్లు, ఓవర్‌పాస్‌లకు రూ.650 కోట్లు, ఎత్తైన వంతెన మార్గాలకు రూ.8,300 కోట్లు, సొరంగాలకు రూ.2,800 కోట్లు, పెద్ద వంతెనలకు రూ.2,500 కోట్లు, చిన్న వంతెనలకు రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వివరించింది. ఈ నిర్మాణాలు వన్యప్రాణులు సురక్షితంగా రహదారులను దాటేందుకు, ఆవాసాల మధ్య సంచార సంబంధాలను కొనసాగించేందుకు దోహదపడుతున్నాయని తెలిపింది.

ప్రతి రహదారి ప్రాంతంలోని పర్యావరణ సున్నితత్వం, జంతువుల సంచార నమూనాలు, నిర్మాణాల సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుని రక్షణ చర్యలను రూపొందిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది. నిర్మాణాలతో పాటు హెచ్చరిక బోర్డులు, కంచెలు, వేగ నియంత్రణ సూచనలు, శబ్ద నిరోధకాలు, సరీసృపాల సంచార మార్గాలు, వర్షపు నీటి సంరక్షణ వంటి చర్యలు చేపడుతోంది.

జంతువులను నిర్దేశిత దాటే మార్గాల వైపు మళ్లించేందుకు, వాహనాలతో ఢీకొనే ప్రమాదాలను తగ్గించేందుకు 300 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారి మార్గాల్లో మార్గదర్శక కంచెలు, శబ్ద నిరోధకాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కెమెరా ట్రాప్‌ల ద్వారా వన్యప్రాణుల కదలికలను పరిశీలిస్తూ రక్షణ చర్యల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తోంది.

రహదారుల ప్రణాళిక, రూపకల్పన, అమలు దశల్లోనే వన్యప్రాణుల సంరక్షణ చర్యలను అనుసంధానించడం అవసరమని పత్రం స్పష్టం చేసింది. సంరక్షణ నిపుణులు, రహదారి నిర్మాణ సంస్థల సమన్వయంతో రవాణా అవసరాలు, జీవవైవిధ్య పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించేందుకు కృషి చేస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →