గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,181-0.28%
NIFTY22,455-0.45%
22K₹1,37,946/10g-0.09%
భాషలు

తాజా వార్తలు

డిసెంబర్ 5 నుంచి 14 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

nagendra24 September 2026, 7:21 PM5 చూసులుtrinetnews.com
డిసెంబర్ 5 నుంచి 14 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలి: జేఈవో డా. ఎ. శరత్

తిరుపతి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 24:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో జేఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం వరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి ఆధ్యాత్మిక అనుభూతితో పాటు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జేఈవో ఆదేశించారు. ప్రతి శాఖ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. పంచమి తీర్థం రోజున భక్తుల రద్దీ అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో ఆదేశించారు.

పంచమి తీర్థం రోజున భక్తుల కోసం పటిష్టమైన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు 4 హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని ముఖ్యమైన ప్రవేశ పాయింట్ల వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు, భక్తులకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేలా సూచిక బోర్డులు, తిరుచానూరు, తిరుపతి ప్రాంతాల్లో అవసరమైన చోట్ల ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

విద్యుత్ వెలుగుల్లో అమ్మవారి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి

బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టే విద్యుత్ అలంకరణలు భక్తులను ఆకట్టుకునేలా, ఆలయ పవిత్రతను ప్రతిబింబించేలా ఉండాలని జేఈవో సూచించారు. ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారులు, మాడ వీధులు, భక్తుల రాకపోకలు జరిగే ప్రాంతాల్లో సంప్రదాయ ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన విద్యుత్ అలంకరణలకు ప్రత్యేక కాన్సెప్ట్ రూపొందించి, అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తుల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం

భక్తుల ఆరోగ్య పరిరక్షణకు ఆరోగ్య, వైద్య శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జేఈవో సూచించారు.

అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సిబ్బంది, మందులు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి

భక్తుల రద్దీకి అనుగుణంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో సూచించారు.

ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలు, క్యూ లైన్లు, మాడ వీధులు, ప్రధాన రహదారుల్లో నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

సమన్వయంతో వైభవంగా బ్రహ్మోత్సవాలు

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించేలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జేఈవో తెలిపారు. అమ్మవారి కృపతో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో టీటీడీ సీఈ శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, డీఎఫ్‌వో శ్రీ డి. ఫణికుమార్ నాయుడు, ఎస్‌ఈ శ్రీ వేంకటేశ్వర్లు, వీజీవో శ్రీ గిరిధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →