ముషీరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 15 : వినాయక చవితి సందర్భంగా ఆకాష్ యాదవ్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాపూజీ నగర్ అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ పాల్గొని వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నేశుని ఆశీస్సులు ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆకాష్ యాదవ్ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతృప్తినిస్తుందని, ప్రజలందరి సహకారంతో భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రమణ, మోహన్ రెడ్డి, వెంకట్ రాపోలు, సతీష్ యాదవ్, స్థానికులు చెముడాల నరసింహ, అనిత, నూనె లత, సాయితేజ యాదవ్, సాయిప్రణీత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






