Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,058/10g-0.04%
भाषाएँ

Latest News

చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ

Good or bad, everyone must face the consequences of their actions. No one can escape divine justice and the laws of nature.

nagendra16 September 2026, 2:12 AM2 व्यूtrinetnews.com
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ

Share this story

Share link keeps your language (?lang=)

ట్రైనెట్ న్యూస్ శశిమోహన కాంతికిరణం

అంటే పుణ్యం కానీ ,పాపం కానీ ....ఎవరు ఏది చేసుకుంటే ఆ ఫలితాన్ని వారే అనుభవించక తప్పదు.

కొన్నాళ్ల క్రితం అఖిల విశ్వం భయంకరమైన విపత్కర పరిస్థితిలో పడింది.దీనికి కారణం ఎవరు.మనిషిలోని స్వార్థపు ఆలోచన కాదా.

చైనా వాడికి తన తోటి దేశాలను నాశనం చేయాలి,తాను అగ్ర రాజ్యమై ఏలాలి అన్న స్వార్థ చింతన కాదా ఈ విపరీతానికి కారణం.

ఏమైంది చివరకు. ముందుగా తన దేశమే ఆపద పాలు అయ్యింది.

ఆ తర్వాత ప్రపంచదేశాలు ఆ మహమ్మారి బారిన పడ్డాయి.

లక్షలాది పౌరులు పిట్టల్లా రాలిపోయారు.ఆ మరణ మృదంగం చైనాలో నే కాక ప్రపంచమంతా పాకిపోయి మారు మ్రోగి పోయింది.

పురుగు పట్టిన పప్పుని కాలే ఎండలో ఎండబోస్తే

కలిసి ఉన్న మంచి పప్పు కూడా కాలిపోయిందట. అలా ఉంది పరిస్థితి.మన లెక్ఖ కాదు.భగవంతుని లెక్ఖ ఒకటి ఉంటుంది.తప్పొప్పులు ఆయన బేరీజు వేస్తాడు. మనం చేసింది మనకు కరెక్ట్ కావొచ్చు .ఆ పరమాత్మ లెక్ఖ అనేది ఉంటుంది.అందులో ఉంటుంది .మన చిట్టా.పాపపుణ్యాల చిట్టా.దుర్యోధనుని దుర్మార్గపు ఆలోచనలకి కురుక్షేత్ర యుద్ధం జరిగింది. జననష్టం జరిగింది.

ప్రపంచ యుధ్ధాలు జరిగాయి.అప్పుడూ అంతే. సర్వ నాశనం జరిగింది.చివరకు సాధించిందేమిటి.వినాశం తప్ప.

వినాశకాలే విపరీత బుధ్ది.అంటే అదే.

ఎవరైనా సరే మోసం చేసి సంపాదిస్తే కలకాలం అనుభవిస్తున్నాడా ?కట్టుకొని పోతున్నాడా ?

ఎంతటి గొప్ప యోధుడైనా, చక్రవర్తి అయినా,మహా బలాఢ్యుడైనా మృత్యువు కౌగిట చేరక తప్పదు.ఎవరూ పోయేటప్పుడు తీసుకు పోయేది ఏమీ లేదు.మన శరీరమే మనతో రాదు.

ఇప్పుడు కూడా చూడండి నేపాల్ వరదలు.

ప్రకృతి ఉగ్ర రూపానికి భవంతులే కుప్పకూలిపోయాయి. ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయాయి. వేలాదిమంది జనం ఆ ఉపద్రవానికి కనపడకుండా పోయారు, కొట్టుకుపోయారు.

ఆశపడి చేర్చుకున్న కూర్చున్న ఆస్తులన్నీ నీళ్ల పాలైపోయాయి. ఎందరో మట్టిలో కూరుకు పోయారు. ఎటు చూసినా ప్రకృతి విలయ తాండవం. ఈ తల రాతలు రాసింది ఎవరు.

నిజంగా దారుణం కదా.

అందుకే జనులారా. మంచి ఆలోచనలే చేయండి.మంచి ఫలితాలు వస్తాయి.మనిషిగా బ్రతకండి.

సన్మంగళాని భవంతు

శుభోదయం.. శశిబాల

ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎవరికైనను తప్పదన్నా...ఏనాడు ఏ తీరొ ఎవరు చెప్పగలరు అనుభవించుట చిత్రమన్నా...

ఎవరు చేసిన పాపం వారనుభవించక తప్పదు.మన లెక్కల్లో మనం తప్పు కాకపోవచ్చు.కానీ భగవంతుడి లెక్క ఒకటుంది. భగవంతుడు మనలోనూ వున్నాడు.మన అంతరాత్మనే.అది మనకు తప్పు చేసినప్పుడల్లా చెబుతూనే ఉంటుంది.కానీ మనమే వినం.

బాబా గారు చెప్పారు..." Help Ever ..Hurt Never" అని.చేతనైతే సాయం చేయాలి.లేకుంటే ఊరుకోవాలి.అంతే కాని ఎవరికీ హాని తలపెట్టకూడదు.మోసం చేసి,కడుపులు కొట్టి సంపాదించినది నిలువదు .ఒకవేళ నిలిచినా అది అనుభవించే వారసులకు ఆ పాపం చేరుతుంది ఆస్తులు చేరినట్లు.

మన కళ్ళముందే ఎన్నో ఉదాహరణలు.ఎందరో కళ్ళముందే తమ వారిని ఆక్సిడెంట్ ల రూపంలో పోగొట్టుకుంటారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బ్రతికించుకోలేరు.ఎందుకు.

కొందరంటారు.మేము అందరికీ ఉపకారమే చేసాము .అయినా మాకెందుకిలా జరుగుతున్నది అని ఆక్రోశిస్తూ వుంటారు.అప్పుడు గ్రహించుకోవాలి.ఈజన్మలో ఏ పాపం చేయకున్నా పోయిన జన్మ ఖర్మ ఫలాన్ని అనుభవిస్తున్నామని. ఈ విషయం ముందు అర్థం కాకున్నా ఆఖరి ఘడియల్లో అర్థమౌతుంది.కానీ అప్పటికే సమయం.మించిపోతుంది.

కనుక మిత్రులారా మీరు చేసుకుంది మీకే..పాపమైనా,పుణ్యమైనా.ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు."Life is a miracle."

*** చరిత్ర పునరావృతం అవుతుంది ***

శుభోదయం.. శశిబాల

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →