గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,521-1.19%
NIFTY22,184-1.65%
22K₹1,37,867/10g-0.19%
భాషలు

తాజా వార్తలు

ఈనెల చివరిలో సిరిసిల్ల లో బహిరంగ సభ భారాస కు గట్టి కౌంటర్ ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana politics heat up as Chief Minister Revanth Reddy plans a massive public meeting in Sircilla on September 30, targeting BRS strongholds.

nagendra21 September 2026, 11:29 PM5 చూసులుtrinetnews.com
ఈనెల చివరిలో సిరిసిల్ల లో బహిరంగ సభ భారాస కు గట్టి కౌంటర్ ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

  • హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 21:

తెలంగాణ రాజకీయం మరోసారి తీవ్ర రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష భారాసను డిఫెన్స్ లోకి నెట్టేలా అధికార కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. గులాబీ పార్టీకి తిరుగులేని కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమరశంఖం పూరించనున్నారు.. ఇందులో భాగంగా ఈ నెల 30న సిరిసిల్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల నల్గొండ జిల్లా నకరేకల్ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. సెప్టెంబర్ ఆఖరులో సిరిసిల్లకు, ఆ తర్వాత అక్టోబర్లో సిద్దిపేటకు వస్తానని బహిరంగ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 30న సిరిసిల్ల సభ నిర్వహణకు కాంగ్రెస్ నాయకత్వం ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. భారాస అధినేత కేసీఆర్ చాన్నాళ్లుగా ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆ పార్టీలో అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావు లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి తీరుతామని సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో నకిరేకల్ సభలో సీఎం చాలెంజ్ చేశారు. ఈ నెలాఖరుకు సిరిసిల్లకు వస్తానని ఆ తర్వతా సిద్ధిపేటపై దండయాత్ర చేస్తామని చాలెంజ్ విసిరారు. రాబోయే ఎన్నికలే టార్గెట్గా వ్యూహ రచన చేస్తున్న సీఎం.. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం

భారాస అనే మొక్క తెలంగాణలో మళ్లీ మొలకెత్తదు అంటూ పదునైన మాటలతే రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →