శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
22K₹1,39,475/10g+0.98%
భాషలు

తాజా వార్తలు

తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించి, పరామర్శించేందుకు వెళ్తున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో తనను రెండోసారి గృహనిర్బంధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.

nagendra2 September 2026, 12:57 AM7 చూసులుtrinetnews.com
తెలంగాణలో ప్రమాదంలో ప్రజాస్వామ్యం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్గొండకు వెళ్లకుండా మరోసారి బీజేపీ చీఫ్ హౌస్‌ అరెస్ట్‌..

బీజేపీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడిని ఖండించిన రాంచందర్‌రావు..

తార్నాక, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 1:

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాం చందర్‌ రావును పోలీసులు మరోసారి హౌస్‌ అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్‌ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఆయనను పరామర్శించేందుకు బీజేపీ చీఫ్ నల్గొండ వెళ్లకుండా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు రాం చందర్ రావు ను తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యను రాం చందర్‌ రావు తీవ్రంగా ఖండించారు. వారం రోజుల్లోనే తనను రెండోసారి హౌస్‌ అరెస్ట్‌ చేశారని ఆయన మండిపడ్డారు. గతంలో విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న సమయంలో వారిని కలవకుండా తనను అడ్డుకున్నారని, ఇప్పుడు పార్టీ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వెళ్లకుండా నిరోధించారని పేర్కొన్నారు.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థాగతంగా అణచివేస్తుందని రాం చందర్‌ రావు విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు, రాజకీయ దాడులకు గురైన బాధితులకు అండగా నిలవకుండా పోలీసు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఒక చేతిలో రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →