శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
22K₹1,38,315/10g+0.14%
భాషలు

తాజా వార్తలు

డీజీపీ. నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్ ను అరెస్ట్ చెయ్యి

Telangana Rakshana Sena Chief Kalvakuntla Kavitha criticized CM Revanth Reddy for betraying activists and slammed police inaction over obscene trolling.

nagendra7 September 2026, 11:03 AM1 చూసులుtrinetnews.com
డీజీపీ. నన్ను అసభ్యంగా కామెంట్ చేసిన పోలీస్ ను అరెస్ట్ చెయ్యి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అధికారం కోసం ఉద్యమకారులను వాడుకోని రేవంత్ రెడ్డి మోసం చేశాడు

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 6:

ఇటీవల కాలంలో మహిళలందరినీ ఇబ్బంది పెట్టే విధంగా దారుణంగా ట్రోలింగ్స్ జరుగుతున్నాయని,

అయినా సరే ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

ముఖ్యంగా శాంతి భద్రతలను రక్షించాల్సింది పోలీసులు

నాలాంటి వ్యక్తిపైనే అత్యంత అసభ్యంగా దూషణలు చేస్తున్నా సరే పోలీసులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక సామాన్య మహిళలకు ఇబ్బందులు వస్తే వాళ్లు ఎవరికీ చెప్పుకుంటారు? మహిళలపై అసభ్యంగా కామెంట్స్ చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ఐటీ చట్టంలో ఉందని ఆమె స్పష్టం చేశారు

. డిపార్ట్ మెంట్ లో ఎవరిమీదనైనా చర్యలు తీసుకుంటే ఆ చర్యలు అసంపూర్తిగా ఉండకూడదన్న చట్టం ఉన్న సంగతి డీజీపీకి తెలియదా? అని ప్రశ్నించారు.

డీజీపీ ఇద్దరు కోడళ్లు ఉన్నారు. వాళ్లపై కూడా ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా? మిస్టర్ డీజీపీ నీ బాధ్యత ఏంటీ? మీ సెన్సిబులిటీ ఏం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి హేట్ స్పీచ్ మీద బిల్లు తెస్తాను అంటాడు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఉద్యమకారుల కాళ్లు పట్టుకున్నంత పనిచేశారని,

అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఆయన పక్కనే కోదండరాం ఉండటంతోనే రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మారు.

వారికి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేకే కమిటీ కి కూడా అన్ని పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాయి. కానీ ఆ కమిటీ రిపోర్ట్ కూడా ముందుకు పోలేదని వాపోయారు. తెలంగాణ జన సమితి తరఫున కోదండరాం ఉద్యమకారులకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా ఉన్నానన్న సంగతి మర్చిపోయారన్నారు. కోదండరాం మీరు ఇచ్చిన ఐడెంటిటీ కార్డులను ప్రభుత్వానికి ఇవ్వొచ్చు కదా? ముఖ్యమంత్రి మాటకు ఈ ప్రభుత్వంలో విలువ లేదా? ఉద్యమకారులను తొక్కుకుంటూ పోతూ వారికి అన్యాయం చేస్తారా? కవిత మండిపడ్డారు. ఇప్పటికే ఉద్యమాలు చేసి వాళ్లంతా అలిసిపోయారు. ఇక మిగిలింది ఆమరణ దీక్ష మాత్రమేనని ఆమె అన్నారు. ఉద్యమకారులకు సంబంధించిన మొత్తం డేటా ప్రభుత్వం వద్ద ఉందని, కొంతమందికైనా గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ ప్రాసెస్ ను మొదలు పెట్టండి అని కోరారు. లేని పక్షంలో

ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా తిరగకుండా చేస్తామని హెచ్చరించారు.

అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణీత కాలవ్యవధితో కూడిన స్పష్టమైన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి చేయాలన్నారు. అసెంబ్లీ చర్చించాల్సిన చాలా అంశాలు ఉన్నప్పటికీ వాటిని చర్చించకుండా అధికార, ప్రతిపక్షాలు డ్రామాలు చేస్తున్నాయని విమర్శించారు.

ఫీజు రెగ్యులేషన్, ఉద్యమకారులకు ఇస్తామన్న వాటికి సంబంధించి చట్టాలు చేయాలన్నారు. బీసీల కోసం కాంగ్రెస్ వందరోజుల కార్యాచరణ చేస్తుందంటే నవ్వొస్తోందన్నారు. బీసీ 42 శాతం రిజర్వేషన్లు అంటూ వారి లెక్క తప్పు చూపిన పార్టీయే ఇప్పుడు బీసీల కోసం ఆందోళనలు చేస్తామంటోందని విమర్శించారు.

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టాలపై కేంద్రంతో కాంగ్రెస్ మాట్లాడటం లేదని…అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లటం లేదన్నారు.

బీసీలకు అన్యాయం చేస్తున్న పార్టీయే వాళ్ల కోసం ధర్నాలు చేస్తుండటం హాస్యాస్పదం కవిత అన్నారు. కేంద్రం చేసే కులగణనలో స్పెసిఫిక్ గా కులం కాలం పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →