Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,683/10g-0.32%
भाषाएँ

Latest News

Former Minister Talasani Srinivas Yadav visits Ganesh Pandals on a Two-Wheeler

Sanatnagar MLA and former minister Talasani Srinivas Yadav toured various colonies in Hyderabad on a two-wheeler on Friday night to visit Ganesh mandaps and offer prayers.

nagendra20 September 2026, 2:01 AM2 व्यूtrinetnews.com
Former Minister Talasani Srinivas Yadav visits Ganesh Pandals on a Two-Wheeler

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్,19.

గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పలు కాలనీలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ముందుగా గొల్ల కొమరయ్య కాలనీ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన గణ నాధుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం జై నగర్, iDH కాలనీ, జై ప్రకాష్ నగర్, పార్ధి వాడ, అమ్ముగూడ, న్యూ బోయిగూడ, సున్నం బట్టి, బన్సీలాల్ పేట లోని BJR నగర్, బండ మైసమ్మ నగర్, D క్లాస్, వివేకానంద కమిటీ హాల్, మెట్ల బావి తదితర ప్రాంతాల్లోని పలు మండపాలలోని గణ నాధులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఉత్సవాల నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఎమ్మెల్యే వెంట బన్సీలాల్ పేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, కొత్తూరు వెంకట్, వెంకటరమణ, అరుణ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నెరేటి రవి, వినోద్, లక్ష్మీపతి, ప్రేమ్, శ్రీనివాస్, కుమార్ యాదవ్, అబ్బాస్, నాగభూషణం తదితరులు ఉన్నారు.

यह भी पढ़ें