గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,877-0.70%
NIFTY22,292-1.17%
22K₹1,37,846/10g-0.20%
భాషలు

తాజా వార్తలు

గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా త్యాగరాయ గానసభలో ‘ఎందరో మహానుభావులు – మధుర స్మృతులు’ కార్యక్రమం

Prominent figures remembered legendary poet and social reformer Gurajada Apparao during the 'Endaro Mahanubhavu – Madhura Smrutulu' event in Hyderabad.

nagendra24 September 2026, 5:08 AM6 చూసులుtrinetnews.com
గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా త్యాగరాయ గానసభలో ‘ఎందరో మహానుభావులు – మధుర స్మృతులు’ కార్యక్రమం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

గురజాడ సాహిత్య సేవలను స్మరించిన ప్రముఖులు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23:

తెలుగు సాహిత్యానికి, సామాజిక సంస్కరణలకు విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు బుధవారం హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ‘ఎందరో మహానుభావులు – మధుర స్మృతులు’ కార్యక్రమంలో భాగంగా గానసభలోని కళా సుబ్బారావు కళావేదికపై ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డి, IAS హాజరయ్యారు. సభకు శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా వి.ఎస్. జనార్ధన్ మూర్తి అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా కవి, సాహితీవేత్త శ్రీమతి శైలజామిత్ర, బృందావనం సంస్థ అధ్యక్షులు వై. సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన తెలుగు సాహిత్యానికి అందించిన సేవలు, సామాజిక చైతన్యానికి చేసిన కృషి, అభ్యుదయ భావజాలం గురించి వక్తలు వివరించారు. సమాజంలోని మూఢనమ్మకాలు, అసమానతలు, సామాజిక దురాచారాలను తన రచనల ద్వారా ప్రశ్నించిన గురజాడ అప్పారావు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.

‘దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్’ అనే గురజాడ సందేశం నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తోందని వక్తలు తెలిపారు. ఆయన రచనలు ప్రజల్లో సామాజిక బాధ్యత, మానవతా దృక్పథం, సమానత్వ భావనలను పెంపొందించాయని గుర్తుచేశారు. ముఖ్యంగా కన్యాశుల్కం వంటి రచనల ద్వారా సమాజంలోని సమస్యలను స్పష్టంగా ప్రతిబింబించి సంస్కరణల అవసరాన్ని చాటిచెప్పారని పేర్కొన్నారు.

గురజాడ సాహిత్య సంపదను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖులు పిలుపునిచ్చారు. శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సాహితీ అభిమానులు, కళాకారులు, ప్రముఖుల సమక్షంలో విజయవంతంగా ముగిసింది.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →