గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,877-0.70%
NIFTY22,292-1.17%
22K₹1,37,846/10g-0.20%
భాషలు

తాజా వార్తలు

చమ్స్ ఎలెవన్‌పై హీరాధి సీసీ ఘన విజయం

Heeradhi CC cruised to a 10-wicket victory against Chums XI in the HCA 'C' Division One-Day League, powered by brilliant unbeaten knocks from Rishi Rathod and Shiva Aditya Dasgupta.

nagendra24 September 2026, 4:59 AM3 చూసులుtrinetnews.com
చమ్స్ ఎలెవన్‌పై హీరాధి సీసీ ఘన విజయం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రిషి రాథోడ్ అజేయ శతకం • శివ ఆదిత్య దాస్‌గుప్తా అజేయ అర్ధశతకం • 10 వికెట్ల తేడాతో గెలుపు

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా చమ్స్ ఎలెవన్ క్రికెట్ క్లబ్, హీరాధి క్రికెట్ క్లబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హీరాధి సీసీ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రిషి రాథోడ్ రామావత్ అజేయ శతకంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించగా, శివ ఆదిత్య దాస్‌గుప్తా అజేయ అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చమ్స్ ఎలెవన్ సీసీ 44.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. హీరాధి సీసీ బౌలర్లలో రిషి రాథోడ్ రామావత్ 8 ఓవర్లలో 43 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. సుహృత్ చౌధరి 8 ఓవర్లలో 45 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించగా, మహమ్మద్ ఇంతియాజ్ 5 ఓవర్లలో కేవలం 3 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు.

203 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హీరాధి సీసీ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 27 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రిషి రాథోడ్ రామావత్ 88 బంతుల్లో 15 ఫోర్ల సహాయంతో అజేయంగా 101 పరుగులు చేయగా, శివ ఆదిత్య దాస్‌గుప్తా 77 బంతుల్లో 6 ఫోర్లతో అజేయంగా 64 పరుగులు సాధించారు.

జట్టు సమష్టి కృషితో అద్భుత విజయాన్ని అందుకున్న క్రీడాకారులందరినీ హీరాధి క్రికెట్ క్లబ్ కార్యదర్శి మహేందర్ గౌడ్ అభినందించారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →