శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,39,318/10g+0.93%
భాషలు

తాజా వార్తలు

సేవా స్ఫూర్తికి సత్కారం.. వెంకటేష్ గుప్తాకు ఘన అభినందన

Haliya Club members felicitated club president Pottumuthu Venkatesh Gupta for receiving the Best Service Award from Ameer Ali Foundation.

nagendra18 August 2026, 2:27 AM114 చూసులుtrinetnews.com
సేవా స్ఫూర్తికి సత్కారం.. వెంకటేష్ గుప్తాకు ఘన అభినందన

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: సేవా కార్యక్రమాల్లో విశేషంగా కృషి చేస్తూ ఉత్తమ సేవా అవార్డుకు ఎంపికైన హాలియా క్లబ్ అధ్యక్షుడు పొట్టుమత్తు వెంకటేష్ గుప్తాను హాలియా క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. బాబా ఆశీర్వాదంతో ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు.

చిన్ననాటి నుంచే సేవా కార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తున్న వెంకటేష్ గుప్తా తన స్నేహితుల బృందంతో కలిసి వినాయక చవితి, దసరా వంటి పండుగల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నిరుపేద కుటుంబాలకు చేయూతనందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ యువతను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తున్నారు.

ఆయన అందిస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించిన అమీర్ అలీ ఫౌండేషన్ ఉత్తమ సేవా అవార్డుకు వెంకటేష్ గుప్తాను ఎంపిక చేసిన నేపథ్యంలో హాలియా క్లబ్ తరఫున ఈ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలిశెట్టి మహేష్, రవీందర్, బచ్చు విశ్వనాథ్ వెంకటేష్ గుప్తాను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మరింతగా సేవలందించాలని ఆకాంక్షించారు.

సత్కారం సందర్భంగా వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ తన సేవలను గుర్తించి ప్రోత్సహిస్తున్న హాలియా క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

అమ్మ దుర్గాభవాని ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు ప్రత్యేక పూజలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ట్రైనెట్‌ న్యూస్‌): ఔషాపూర్ లోని శ్రీశ్రీశ్రీ అమ్మ దుర్గాభవాని మాత దేవాలయంలో అక్టోబర్‌ 11 నుంచి 20 వరకు

మిగతా చదవండి →