గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,639+0.35%
NIFTY22,277-1.24%
22K₹1,37,722/10g-0.28%
భాషలు

తాజా వార్తలు

సార్వత్రిక ఆరోగ్య సంరక్షణలో భారత్‌ పురోగతి యూఎన్‌జీఏ-81 వేదికగా హెపటైటిస్ నిర్మూలన, సికిల్ సెల్ చికిత్సలో చేపట్టిన చర్యల వివరణ

At the 81st UN General Assembly, India showcased its strides in universal health coverage, hepatitis elimination goals, and sickle cell disease management.

nagendra24 September 2026, 7:14 PM2 చూసులుtrinetnews.com
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణలో భారత్‌ పురోగతి యూఎన్‌జీఏ-81 వేదికగా హెపటైటిస్ నిర్మూలన, సికిల్ సెల్ చికిత్సలో చేపట్టిన చర్యల వివరణ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ఏబీ–పీఎంజేఏవై, ఈ–సంజీవని సేవలను ప్రపంచానికి పరిచయం చేసిన భారత్

1.8 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 90 కోట్లకు పైగా ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు సంఖ్యలు, 49.7 కోట్లకు పైగా టెలీ కన్సల్టేషన్లతో సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ దిశగా భారత్‌ ముందడుగు: కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి

2030 నాటికి హెపటైటిస్ నిర్మూలన దిశగా భారత్ సాధించిన పురోగతిని వివరించిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ

యూఎన్‌జీఏ-81లో ‘వన్‌ఎస్‌సీడీ’ ప్రారంభానికి ప్రపంచ భాగస్వాములతో చేతులు కలిపిన భారత్

సికిల్ సెల్ వ్యాధిపై సమగ్ర కార్యాచరణ, 2047 నాటికి నిర్మూలన లక్ష్యాన్ని వివరించిన భారత్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24:

అందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటు ధరల్లో చేరువ చేయాలనే తన నిబద్ధతను భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడంతోపాటు ప్రాధాన్య ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యలను ప్రపంచ దేశాలతో పంచుకుంది. న్యూయార్క్‌లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (యూఎన్‌జీఏ-81) సందర్భంగా నిర్వహించిన రెండు కీలక అంతర్జాతీయ ఆరోగ్య సమావేశాల్లో భారత్‌ తన అనుభవాలను వివరించింది.

సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ, ప్రపంచ ఆరోగ్య మిత్రదేశాల బృందం నిర్వహించిన ఏడో వార్షిక మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ పాల్గొన్నారు. సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవల నుంచి ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవల వరకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత్‌ చేపడుతున్న చర్యలను ఆమె వివరించారు. వైద్య ఖర్చుల కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు.

దేశవ్యాప్తంగా 1.8 లక్షలకు పైగా ఏర్పాటు చేసిన ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల’ ద్వారా విస్తృత స్థాయి వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వీటి ద్వారా పునరుత్పత్తి, మాతా–శిశు ఆరోగ్య సేవలు, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ–నిర్వహణ, మానసిక ఆరోగ్యం, వృద్ధుల సంరక్షణ, ఉపశమన చికిత్సలతోపాటు వ్యాధుల నివారణ, ఆరోగ్య పరిరక్షణ, చికిత్స సేవలను అందిస్తున్నట్లు వివరించారు. ప్రాథమిక ఆరోగ్య సేవల్లో నాణ్యతా ప్రమాణాలకు నిరంతరం ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిధులతో అమలవుతున్న ఆరోగ్య భరోసా పథకం ‘ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ (ఏబీ–పీఎంజేఏవై) ద్వారా సమాజంలోని బలహీన, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక రక్షణను బలోపేతం చేస్తున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు. రోగులపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ‘ఉచిత మందులు, రోగ నిర్ధారణ సేవల కార్యక్రమం’, ‘ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం’ కీలకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమాలు అత్యవసర వైద్య సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు.

సమన్వయంతో కూడిన నిరంతర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఆమె వివరించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా అందించే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సేవలతో అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన రోగులను ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించే పటిష్ఠమైన రిఫరల్ వ్యవస్థ కూడా దీనికి తోడ్పడుతోందన్నారు.

వ్యాధుల నివారణ, ఆరోగ్య పరిరక్షణ, చికిత్స సేవలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు అవసరమైన సమయంలో ప్రత్యేక వైద్య సేవలు అందేలా చూడటమే భారత్‌ అనుసరిస్తున్న సమగ్ర ఆరోగ్య విధానం ప్రధాన లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →