గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
22K₹1,37,990/10g-0.10%
భాషలు

తాజా వార్తలు

మంగళంపల్లి బాలమురళీకృష్ణ 96వ జయంతి మహోత్సవం

The 96th birth anniversary of musical legend Padma Vibhushan Dr. Mangalampalli Balamuralikrishna is being grandly organized by the National Music Artists Association in Hyderabad.

nagendra19 September 2026, 2:43 AM5 చూసులుtrinetnews.com
మంగళంపల్లి బాలమురళీకృష్ణ 96వ జయంతి మహోత్సవం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

జాతీయ సంగీత కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

సంగీత విద్వాంసులు, కళాకారులకు ప్రత్యేక సన్మానాలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 18:

పద్మవిభూషణ్, సంగీత దిగ్గజం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 96వ జయంతి మహోత్సవాన్ని జాతీయ సంగీత కళాకారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన హాలులో సెప్టెంబర్ 18న సాయంత్రం 4 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

తెలుగు సంగీత ప్రపంచానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అందించిన అపూర్వ సేవలను ఈ సందర్భంగా స్మరించనున్నారు. శాస్త్రీయ సంగీతాన్ని తన వినూత్న గానశైలితో ప్రపంచవ్యాప్తంగా విశిష్ట స్థాయికి తీసుకెళ్లిన ఆయన సేవలను ప్రముఖులు కొనియాడనున్నారు.

ఈ వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.వి. రమణాచారితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సంగీత విద్వాంసులు, కళాకారులు పాల్గొననున్నారు.

కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయకులు, వాయిద్య కళాకారుల సంగీత ప్రదర్శనలు నిర్వహించనున్నారు. సంగీత రంగానికి విశేష సేవలు అందిస్తున్న కళాకారులు, కళాభిమానులను సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

జాతీయ సంగీత కళాకారుల సంఘం కళాకారుల సంక్షేమంతో పాటు భారతీయ సంగీత, సాంస్కృతిక సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సంగీత మహోత్సవానికి కళాకారులు, సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి

బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి నియామకం

బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి నియామకం

బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి నియామకం... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 08 : భారతీయ జనతా పార్టీ తెలంగా ణ రాష్ట్ర మహిళా మోర్చా కార్య వర్గ సభ్యురాలిగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు చెం

మిగతా చదవండి →

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →