గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
22K₹1,37,990/10g-0.10%
భాషలు

తాజా వార్తలు

మణికుమార్ క్రికెట్ క్లబ్ ఘన విజయం

Manikumar Cricket Club defeated Sacred Heart CC by 8 wickets in the HCA 'C' Division One-Day League championship match, powered by stellar performances from Prateek, Vedas, Harshavardhan, and Tarun.

nagendra19 September 2026, 2:58 PM26 చూసులుtrinetnews.com
మణికుమార్ క్రికెట్ క్లబ్ ఘన విజయం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ప్రతీక్, వేదాస్ అద్భుత బౌలింగ్‌.. హర్షవర్ధన్, తరుణ్ అజేయ అర్ధశతకాలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19:

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ‘సి’ డివిజన్ వన్‌డే లీగ్ ఛాంపియన్ మ్యాచ్‌లో మణికుమార్ క్రికెట్ క్లబ్ అద్భుత ప్రదర్శనతో సేక్రెడ్ హార్ట్ క్రికెట్ క్లబ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రీన్ వ్యూ క్రికెట్ గ్రౌండ్-2లో జరిగిన ఈ మ్యాచ్‌లో మణికుమార్ సీసీ బౌలర్లు ప్రతీక్ రాజనేని, వేదాస్ వురాడి అద్భుతంగా రాణించగా, బ్యాటింగ్‌లో డి. హర్షవర్ధన్, కెప్టెన్ నగరం తరుణ్ రెడ్డి మెరిశారు.

టాస్ గెలిచిన మణికుమార్ క్రికెట్ క్లబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సేక్రెడ్ హార్ట్ సీసీ 42.5 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. మణికుమార్ సీసీ బౌలర్లలో ప్రతీక్ రాజనేని 9 ఓవర్లలో 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. వేదాస్ వురాడి 9 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.

224 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మణికుమార్ సీసీ కేవలం 36.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 225 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డి. హర్షవర్ధన్ 81 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ నగరం తరుణ్ రెడ్డి 57 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 68 పరుగులు చేశాడు. ఓపెనర్ వేదాస్ వురాడి 54 బంతుల్లో 3 ఫోర్లతో 43 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మణికుమార్ క్రికెట్ క్లబ్ ఆటగాళ్లు సమష్టిగా ప్రదర్శించిన జట్టు స్ఫూర్తిని క్లబ్ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రియదర్శిని ప్రాతురి, కార్యదర్శి కృష్ణ చతుర్వేదుల అభినందించారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు సంయుక్త కార్యదర్శి రవి తేజ్ చతుర్వేదుల జ్ఞాపికలు, పతకాలు అందజేశారు.

ఇవి కూడా చదవండి

బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి నియామకం

బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి నియామకం

బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి నియామకం... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 08 : భారతీయ జనతా పార్టీ తెలంగా ణ రాష్ట్ర మహిళా మోర్చా కార్య వర్గ సభ్యురాలిగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు చెం

మిగతా చదవండి →

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →