Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,38,058/10g-0.04%
भाषाएँ

Latest News

పురాతన ఆలయాన్ని సందర్శించిన మర్రి శశిధర్ రెడ్డి

Former MLA and BJP National Council Member Marri Shashidhar Reddy inspected the dilapidated Sri Gnananjaneya Swamy Temple on Saturday.

nagendra13 September 2026, 3:00 AM3 व्यूtrinetnews.com
పురాతన ఆలయాన్ని సందర్శించిన మర్రి శశిధర్ రెడ్డి

Share this story

Share link keeps your language (?lang=)

హైద్రాబాద్ , ట్రైనెట్ న్యూస్. సెప్టెంబర్ 12 : బన్సీలాల్ పేట్ లోని "సి" క్లాస్ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న అతిపురాతన శ్రీ జ్ఞానాంజనేయ స్వామి దేవాలయాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి సందర్శించారు. గత కొంతకాలంగా ఆలయాన్ని మూసివేసి పూజలు నిలిపివేశారని స్థానికులు ఆయనకు వినతి పత్రం అందజేశారు. 300 గజాల స్థలములో మద్యలో రేకులను తొలగించి మొత్తం స్థలాన్ని కాపాడి, నూతన ఆలయ నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసామని, వారు వచ్చి విచారణ చేపట్టారని, అక్కడ ఎటువంటి వివాదస్పద నిర్మాణాలను చేపట్టవద్దని సూచించారని వారు అన్నారు.

అనంతరం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు స్వామివారికి ప్రతిరోజూ పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకుడు మర్రి పురురవ రెడ్డి, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా బిజెపి బీసీ మోర్చా అధ్యక్షుడు వై సురేష్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు మహేష్ , బన్సీలాల్ పేట్ డెవలప్మెంట్ & వేల్ పేర్ అసోసియేషన్ ప్రతినిధులు సి. ప్రకాశ్ , రామమోహన్, కె. విజయ్ కుమార్, సి. రవీందర్, మదన్ మోహన్, పురుషోత్తం, ఆర్. శివాజీ, చిట్టి , కె. శ్రవణ్, శ్రీహరి పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →