Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,739/10g-0.27%
भाषाएँ

Latest News

ఆధునిక వీధినాటికలను ప్రోత్సహించాలి శ్రీజ సాదినేని

Noted theatre and film personality Sreeja Sadineni emphasized the need to promote modern street plays for future generations.

nagendra16 September 2026, 2:30 AM2 व्यूtrinetnews.com
ఆధునిక వీధినాటికలను ప్రోత్సహించాలి శ్రీజ సాదినేని

Share this story

Share link keeps your language (?lang=)

రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 15 :

ఆధునిక వీధినాటికలను ప్రోత్సహించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రంగస్థల, సినీ నటి, రచయిత్రి, దర్శకురాలు శ్రీజ సాదినేని అన్నారు. అలవోకగా చెప్పే సామెతలకు దృశ్యరూపం ఇచ్చి వేదికపై ప్రదర్శించడం అంత తేలికైన విషయం కాదని చెప్పారు . ఈ సందర్భంగా శ్రీజ మీడియాతో మాట్లాడుతూ .. వంశీ ఆర్ట్ థియేటర్స్ యాభై ఐదవ వార్షికోత్సవ వేడుకల సందర్బంగా శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించిన కార్యక్రమంలో ఆధునిక వీధినాటికగా శ్రీజయా ఆర్ట్స్ హైదరాబాద్ ప్రదర్శించిన తంత్రసామెతం ఆహూతులను అలరించిందన్నారు. నేటి యువత తెలుగుకు దూరమవుతున్న నేపథ్యంలో ఇలాంటి కళారూపాల ద్వారా వారికి మంచి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుందని ఆమె తెలిపారు. సామెతలు రోజూ వినేవారికి వాటి అర్ధం కూడా సరిగా తెలియదని, మాటల్లో చెప్పడం కంటే నాటకం ద్వారా చూపించడంలో ఆ సామెతలకు అర్ధం అర్ధవంతంగా అందరికీ చేర్చడంలో తమ టీం సక్సెస్ అయిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. శ్రీజ సాదినేని నటించి, దర్శకత్వం వహించిన ఈ నాటికలో శశిధర్ ఘణపురం, హైకోర్టు శ్రీలక్ష్మి, ఆర్. కే. యోధ, అఖిల్ శ్రీవత్స నటించి అందరిని ఆకట్టుకుంది.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →