శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
22K₹1,38,405/10g+0.20%
భాషలు

తాజా వార్తలు

చలో ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొన్న మోత్కూరు మండల బీజేపీ నాయకులు

Mothkur BJP leaders joined the dharna at Indira Park, slamming the Congress government over 22-A land restrictions.

nagendra6 September 2026, 7:41 AM3 చూసులుtrinetnews.com
చలో ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొన్న మోత్కూరు మండల బీజేపీ నాయకులు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ట్రై నెట్ న్యూస్, సెప్టెంబరు05/:

కాంగ్రెస్ నిర్ణయం భూ యజమానుల పాలిట పెనుశాపం! 22-ఏ ఆంక్షల పేరుతో ప్రజల సొంత భూములను అమ్ముకోలేని పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం దారుణమని మోత్కూరు మండల బీజేపీ నాయకులు మండిపడ్డారు. అవసరాలకు ఉపయోగపడాల్సిన సొంత భూమిని విక్రయించుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇది ప్రజా పాలనా? లేక ప్రజల హక్కులపై ఆంక్షలా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రజల భూములకు విముక్తి కల్పించాల్సిన ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా మరింత జటిలం చేస్తోందని విమర్శించారు. 22-ఏ సమస్యను తక్షణమే పరిష్కరించి భూ యజమానులకు హక్కులు కల్పించాలి. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు జితేందర్ రెడ్డి, మోత్కూరు మండల బీజేపీ అధ్యక్షులు గుధే మధుసూదన్ యాదవ్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కొంపెల్లి గణేష్, పనకబండ గ్రామ ఉపసర్పంచ్ రాధారపు మల్లేశం, మండల పార్టీ ఉపాధ్యక్షులు లేలెల బాలనరసింహ, గుంటి సతీష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పైళ్ల సతీష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు భీముడి తిరుమల రెడ్డి, బీజేపీ నాయకులు నల్లపోగుల వెంకన్న, కడమంచి సైదులు, ముక్కముల గణేష్, లోతుకుంట ధర్మ, రాధారపు చెందు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →