గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
22K₹1,37,990/10g-0.10%
భాషలు

తాజా వార్తలు

కెంట్ యూనివర్సిటీతో ఓయూ విద్యా, పరిశోధన భాగస్వామ్యంపై చర్చలు..

Osmania University and the University of Kent held a meeting to explore mutual cooperation in academics and research.

nagendra20 September 2026, 2:29 AM2 చూసులుtrinetnews.com
కెంట్ యూనివర్సిటీతో ఓయూ విద్యా, పరిశోధన భాగస్వామ్యంపై చర్చలు..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడమే లక్ష్యం: వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం..

ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 19: ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కెంట్ మధ్య విద్యా, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారానికి అవకాశాలను అన్వేషిస్తూ శుక్రవారం సమావేశం జరిగింది. కెంట్ బిజినెస్ స్కూల్ (కేబిఎస్) డీన్ ప్రొఫెసర్ విక్కీ నైట్, ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం అధ్యాపకులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, ఇరు విశ్వవిద్యాలయాల స్థాయిలో విస్తృత సహకారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఇరు సంస్థల మధ్య అధ్యాపకుల పరస్పర అనుసంధానం (ఫ్యాకల్టీ మ్యాచింగ్) చేపట్టడం ద్వారా అర్థవంతమైన విద్యా భాగస్వామ్యాలను అభివృద్ధి చేయాలని వీసీ ప్రొఫెసర్ కుమార్ ఆకాంక్షించారు. ప్రతిపాదిత సహకారాన్ని కార్యరూపంలోకి తీసుకెళ్లేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేష్ రెడ్డి, ఓఎస్డీ టు వీసీ ప్రొఫెసర్ ఎస్. జితేందర్ కుమార్ నాయక్, ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ ప్రొఫెసర్ వి. జహంగీర్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ డీన్ ప్రొఫెసర్ ఇంద్రకంటి శేఖర్, రూసా నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ శ్రీనివాసులు సి. తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి నియామకం

బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి నియామకం

బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి నియామకం... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 08 : భారతీయ జనతా పార్టీ తెలంగా ణ రాష్ట్ర మహిళా మోర్చా కార్య వర్గ సభ్యురాలిగా హైదరాబాద్ సెంట్రల్ జిల్లాకు చెం

మిగతా చదవండి →

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →