శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
22K₹1,38,518/10g+0.28%
భాషలు

తాజా వార్తలు

నాచారం నుండి ఉప్పల్ వెళ్ళే వాహనాలకు ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలి – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Uppal MLA Bhandari Laxma Reddy has requested the GHMC Commissioner to arrange a free left at Habsiguda crossroads to ease traffic congestion.

nagendra6 September 2026, 6:07 AM3 చూసులుtrinetnews.com
నాచారం నుండి ఉప్పల్ వెళ్ళే వాహనాలకు ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలి – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదారాబాద్,నాచారం, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 5:

నాచారం నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హబ్సిగూడ చౌరస్తాలో ప్రత్యేక ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కోరారు. ఈ మేరకు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి సమస్యను వివరించారు. నాచారం నుంచి ఉప్పల్, తార్నాక వైపు నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో హబ్సిగూడ చౌరస్తా వద్ద తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. సిగ్నల్ వద్ద వాహనదారులు 10 నుంచి 12 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. రద్దీ సమయాల్లో హబ్సిగూడ నుంచి హెచ్ఎంటీ నగర్ కమాన్ వరకు వాహనాలు బారులు తీరుతున్నాయని పేర్కొన్నారు. ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యేక ఫ్రీ లెఫ్ట్ లేకపోవడం వల్ల సిగ్నల్ కోసం వేచి ఉండాల్సి వస్తోందన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్రీ లెఫ్ట్‌కు అవసరమైన మేర రహదారిని విస్తరించాలని కోరారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్‌లు ఆక్రమణలకు గురైనట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిని పరిశీలించి ఆక్రమణలు తొలగించి వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు.

ఎమ్మెల్యే విజ్ఞప్తిపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించి, త్వరలో నియోజకవర్గంలోని ఫ్రీ లెఫ్ట్‌లను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, విఠల్ యాదవ్, కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →