హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 26: కళాసత్కార్ ఆధ్వర్యంలో సినీ నేపథ్య మధుర గాయని ఎస్. జానకి స్వర నివాళి పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు గాయకుడు రామ్ ప్రసాద్ నిర్వహణలో ప్రముఖ గాయనీ, గాయకులు పి. విజయ్‌కుమార్ డి. శ్రీనివాస్ , శేషు, శ్రీదేవి, సరస్వతి, లక్ష్మి ప్రియశ్రీ తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.








