గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,877-0.70%
NIFTY22,292-1.17%
22K₹1,37,846/10g-0.20%
భాషలు

తాజా వార్తలు

111 సినీ గీతాలతో అరుదైన రికార్డు

Renowned singer Malladi Usha Rani secured four prestigious records by performing 111 film songs continuously for 12 hours with 20 co-singers in Hyderabad.

nagendra24 September 2026, 5:04 AM4 చూసులుtrinetnews.com
111 సినీ గీతాలతో అరుదైన రికార్డు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గాయని మల్లాది ఉషారాణి

20 మంది సహ గాయకులతో 12 గంటలపాటు నిర్విరామ సంగీత ప్రదర్శన

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్):

ప్రముఖ గాయని శ్రీమతి మల్లాది ఉషారాణి 12 గంటలపాటు నిర్విరామంగా 111 సినీ గీతాలను ఆలపించి అరుదైన ఘనత సాధించారు. ఈ సంగీత ప్రదర్శన ద్వారా ఆమె నాలుగు ప్రతిష్ఠాత్మక రికార్డులు, అవార్డులను సొంతం చేసుకున్నారు.

సెప్టెంబర్ 19న చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించిన ప్రత్యేక సంగీత కార్యక్రమంలో ఉషారాణి 20 మంది సహ గాయకులతో కలిసి మొత్తం 111 పాటలను ఆలపించారు. 1932 నుంచి 2024 వరకు సుమారు 50 మంది ప్రముఖ గాయనీమణులు ఆలపించిన సినీ గీతాలను ఎంపిక చేసుకొని ప్రదర్శించడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తొలితరం గాయని రావు బాలసరస్వతీదేవి నుంచి నేటి తరం గాయని గీతా మాధురి వరకు వివిధ తరాలకు చెందిన గాయనీమణుల పాటలను ఆమె తనదైన శైలిలో ఆలపించారు. శ్రీరంగం గోపాలరత్నం, జిక్కి, లీల, పి.సుశీల, ఎస్.జానకి తదితర ప్రముఖ సినీ నేపథ్య గాయనీమణుల గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు.

ఈ అద్భుత ప్రదర్శనతో మల్లాది ఉషారాణి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ ఐకాన్ అవార్డ్స్, వావ్ మ్యూజిక్ నంది అవార్డ్స్, గ్లోబల్ మల్టీ టాలెంట్ అవార్డ్స్లో గుర్తింపు పొందారు.

శ్రీవరం సుస్వరాలు, గ్లోబల్ టాలెంటెడ్ మ్యూజికల్ ఆర్ట్స్ ఫౌండేషన్, ఇండియన్ కల్చరల్ ఐకాన్ అవార్డ్స్, ఉషా మ్యూజిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, పీఎంఎస్‌ఎస్‌ఎస్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ సందర్భంగా బింగి నరేందర్ గౌడ్, మూర్తి శ్రీరామ్, నాగ శివరామ్, త్రినాథరావు, సుధారాణి తదితర ముఖ్య అతిథుల చేతుల మీదుగా మల్లాది ఉషారాణి అవార్డులను అందుకున్నారు. సంగీతంపై అంకితభావంతో 20 మంది సహ గాయకుల సహకారంతో 111 పాటలను ఆలపించి సరికొత్త రికార్డు నెలకొల్పడం అభినందనీయమని అతిథులు కొనియాడారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →