Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-0.44%
NIFTY22,232-0.85%
HYD 22K₹1,39,431/10g+0.95%
भाषाएँ

Latest News

Sri Krishnashtami Celebrations Held in Grand Manner at OU

nagendra5 September 2026, 8:52 AM2 व्यूtrinetnews.com
Sri Krishnashtami Celebrations Held in Grand Manner at OU

Share this story

Share link keeps your language (?lang=)

ఉస్మానియా యూనివర్సిటీ...

హైదారాబాద్, తార్నాక, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 4:

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యాదవ కార్పొరేషన్ చైర్మన్ జగదీష్ యాదవ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ ఉట్టి కొట్టే కార్యక్రమంలో అతిథులు, విద్యార్థి సంఘాల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు తన జీవితంలో ధర్మాన్ని, న్యాయాన్ని, సమాజ శ్రేయస్సును బోధించారని పేర్కొన్నారు.

కృష్ణ తత్వం నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలో ధర్మబద్ధమైన విలువలను పెంపొందిస్తూ, అందరూ కలలు కంటున్న సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రమేష్ యాదవ్, మహేష్ గౌడ్, చేరాల వంశీ, సైదులు యాదవ్, మానవతా రాయ్, వేణు తో పాటు పలువురు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →