శుక్రవారం9 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
22K₹1,37,885/10g-0.16%
భాషలు

తాజా వార్తలు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టత... ఆశ్రమ పాఠశాలల పండిట్లు, పీఈటీల పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై పరిశీలన

nagendra11 September 2026, 12:52 AM4 చూసులుtrinetnews.com
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై స్పష్టత... ఆశ్రమ పాఠశాలల పండిట్లు, పీఈటీల పోస్టుల అప్‌గ్రేడేషన్‌పై పరిశీలన

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

శాసనమండలిలో సభ్యుల పలు ప్రశ్నలకు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సమాధానం

  • హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 10:

  • రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న పండిట్లు, వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల పోస్టుల అప్‌గ్రేడేషన్‌కు సంబంధించిన అంశాలపై సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ శాసనమండలిలో గురువారం శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న , తక్కెళ్ళపల్లి రవీందర్ రావ్, సత్యం నెలికంటి లేవనెత్తిన అంశాలకు మంత్రి అడ్లూరి వివరాలను వెల్లడించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ.. 2025–26 విద్యా సంవత్సరం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.8,591.62 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేటు కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయడానికి వారి నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయన్న అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ, అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. దీంతో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కళాశాలలపై చర్యలకు సంబంధించిన తదుపరి ప్రశ్న ఉత్పన్నం కాదని తెలిపారు.

అలాగే ఎమ్మెల్సీలు శ్రీపాల్ రెడ్డి లేవనెత్తిన అంశం....పండిట్లు, పీఈటీల పోస్టుల అప్‌గ్రేడేషన్‌ ,

ఆశ్రమ పాఠశాలల్లోని పండిట్లు, పీఈటీల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్‌ చేసే అంశంపై మంత్రి అడ్లూరి.. సమాధానం ఇస్తూ, ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారంతో పాటు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది అంశాలపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ చర్యలు తీసుకుంటోందని మంత్రి అడ్లూరి తెలిపారు.

ఇవి కూడా చదవండి

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సుకే శ్రీ శ్రీ కవిత్వం: జస్టిస్ విశ్వేశ్వర రావు

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక

మిగతా చదవండి →