గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,877-0.70%
NIFTY22,292-1.17%
22K₹1,37,846/10g-0.20%
భాషలు

తాజా వార్తలు

‘డిజిటల్ గవర్నెన్స్’లో రోల్ మోడల్ గా తెలంగాణ ఇంటి ముంగిటకే ‘మీ సేవా’ సేవలు

nagendra24 September 2026, 4:54 AM2 చూసులుtrinetnews.com
‘డిజిటల్ గవర్నెన్స్’లో రోల్ మోడల్ గా తెలంగాణ ఇంటి ముంగిటకే ‘మీ సేవా’ సేవలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

తొలి దశలో ‘క్యూర్’ ప్రాంతాల్లో అమలు

‘మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 23:

“గుడ్ గవర్నెన్స్” కు టెక్నాలజీని జోడించి ‘డిజిటల్ గవర్నెన్స్’లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పౌర సేవల్ని నేరుగా ఇంటి ముంగిటకే చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. బుధవారం బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ‘మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలనలోనూ అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అడ్మినిస్ట్రేషన్ కు టెక్నాలజీని జోడించి పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రభుత్వం, యంత్రాంగమే నేరుగా ప్రజల దగ్గరికే వెళ్లేలా ఈ ‘డోర్ డెలివరీ సర్వీసెస్’కు శ్రీకారం చుట్టామన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్ లేదా మీ సేవ పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే... జనన/మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికేట్లు, ఈసీ కాపీలు, పోలీసు శాఖ సేవలు, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్లు తదితర మీ సేవా సేవలను ఇంటి దగ్గరే అందిస్తామన్నారు. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవ ఏజెంట్లు, మీ సేవ వీఎల్ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. తొలిదశలో ‘క్యూర్’ ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామన్నారు. పౌరులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని... ఇంటి నుంచే పౌర సేవల్ని పొందాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఐటీఈఅండ్ సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, మీ సేవా కమిషనర్ రవి కిరణ్, టీజీటీఎస్ ఎండీ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →