హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 04 : రాష్ట్రం కరువుతో అల్లాడుతోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలంటూ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు 20 అడుగులు పడిపోయాయని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణ యాగం చేసినా.. వర్షాలు పడక పోవడంతో ఆయన చేతులెత్తేశారని వ్యంగ్యంగా అన్నారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో 6 గంటలకు మించి విద్యుత్ ఇవ్వడం లేదని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు.విద్యుత్ కోతలు నిరూపించేందుకు సీఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రమ్మన్నా వస్తానంటూ ఆయనకు కవిత సవాల్ విసిరారు. ప్రభుత్వం ఏం చేసైనా రైతులకు కరెంట్ ఇచ్చి తీరాల్సిందేనని సీఎం రేవంత్‌కి స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో నిండుగా నీళ్లున్నా రాష్ట్రంలోని ప్రాజెక్టులను వాటితో నింపలేదని ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత ప్రశ్నించారు
తాజా వార్తలు
తక్షణమే కరువు మండలాలు ప్రకటించాలి: టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ
మిగతా చదవండి →గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న
మిగతా చదవండి →దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్
మిగతా చదవండి →కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త
మిగతా చదవండి →