Thursday8 October 2026Hyderabad

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,836/10g-0.20%
Languages

Latest News

టీఎస్‌యూటీఎఫ్ హాలియా మండల కమిటీ ఎన్నిక

nagendra8 October 2026, 12:05 PM0 viewstrinetnews.com
టీఎస్‌యూటీఎఫ్ హాలియా మండల కమిటీ ఎన్నిక

Share this story

Share link keeps your language (?lang=)

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా: హాలియాలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పి. వెంకటేశం, జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాస్ చారి, జిల్లా కోశాధికారి వడిత్యా రాజు, జిల్లా కార్యదర్శి రమాదేవి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎం. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం టీఎస్‌యూటీఎఫ్ పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూతపడినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు.ఉద్యోగుల సమస్యలకు సంబంధించిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నంబర్ 25ను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నూతన మండల కమిటీమండల కమిటీ అధ్యక్షులుగా చింతపల్లి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్కే సయ్యద్ మియా, ఉపాధ్యక్షులుగా చెన్ను వెంకటరెడ్డి, మచ్చ సునీత, కోశాధికారిగా ఏలేటి నాగరాజు, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ కన్వీనర్‌గా గండి యాదగిరిని ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తలు బీవీ రావు, షర్ఫుద్దీన్, వీరాసింగ్, పాల్వాయి శ్రీనివాస్, జ్యోతి, శివరాం, రవీందర్, మహేష్, సైదులు, ఓ. సరిత, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Also read