Saturday10 October 2026Hyderabad

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,163/10g+1.53%
Languages

Latest News

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ బృందం యూరప్ స్టడీ టూర్ విజయవంతం స్పీక‌ర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతలు, అభిమానుల ఘన స్వాగతం

nagendra10 October 2026, 2:28 AM0 viewstrinetnews.com
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ బృందం యూరప్ స్టడీ టూర్ విజయవంతం స్పీక‌ర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేతలు, అభిమానుల ఘన స్వాగతం

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9:

తెలంగాణ శాసనసభ సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ యూరప్ పర్యటన విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన స్టడీ టూర్ ను విజయవంతంగా ముగించుకుని శుక్ర‌వారం ఉదయం 9 గంట‌ల‌కు శంషాబాద్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న స్పీకర్ ప్ర‌సాద్ కుమార్ కి వికారాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నాయకులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు.

యూరప్ పర్యటనలో భాగంగా జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల్లో పలు అధ్యయన కార్యక్రమాల్లో స్పీకర్ బృందం పాల్గొంది. స్టడీ టూర్ లో భాగంగా ఆయా దేశాల పార్లమెంటరీ వ్యవస్థలు, శాసనసభల పనితీరు, ప్రజాస్వామ్య ప్రక్రియలు, చట్టాల రూపకల్పన విధానాలు, శాసనసభల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, చట్టాల రూపకల్పన విధానాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు వంటి అనేక కీలక అంశాలపై స్పీకర్ బృందం అధ్యయనం చేసింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి స్పీకర్ బృందం యూరప్ పర్యటనలో విదేశీ ప్రతినిధులకు, పెట్టుబడిదారులకు వివరించింది. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అందిస్తున్న సహాయ, సహకారాలు, భద్రత, పారదర్శక విధానాల గురించి వివరించి, వారిలో భరోసా కల్పించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా చేపట్టిన యూర‌ప్ పర్యటన విజయవంతమైందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. స్పీకర్ తో పాటు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసనసభ కార్యదర్శి రెండ్ల‌ తిరుపతి, శాసనమండలి కార్యదర్శి నరసింహాచార్యులు గారు కూడా విదేశీ పర్యటన పూర్తి చేసుకుని, హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరందరికీ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ చేపట్టే కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని నాయ‌కులు, అభిమానులు ఆకాంక్షించారు.

Also read

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

Read more →