గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,852-0.73%
NIFTY22,277-1.24%
22K₹1,37,722/10g-0.28%
భాషలు

తాజా వార్తలు

చిక్కడపల్లిలో అలరించిన తెలుగు–హిందీ సినీ సంగీత విభావరి వేదం కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సీజన్‌–15’

Vedam Cultural Organization successfully hosted its Season-15 Telugu-Hindi film musical concert at Sri Thyagaraya Gana Sabha, Hyderabad.

nagendra24 September 2026, 5:05 AM3 చూసులుtrinetnews.com
చిక్కడపల్లిలో అలరించిన తెలుగు–హిందీ సినీ సంగీత విభావరి వేదం కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సీజన్‌–15’

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (ట్రైనెట్ న్యూస్): వేదం కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలుగు–హిందీ సినీ సంగీత విభావరి ‘సీజన్‌–15’ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా సుబ్బారావు కళావేదికలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

సంస్థ నిర్వాహకుడు, గాయకుడు ఆనంద్ నేతృత్వంలో జరిగిన ఈ సంగీత విభావరిలో గాయని రేణుకా రమేష్‌ (మధుర గాన మయూఖ), గాయని, వ్యాఖ్యాత ప్రశాంతి, గాయకుడు రుద్రారెడ్డి పాల్గొన్నారు. తెలుగు, హిందీ చిత్రాల్లోని పలు మధుర గీతాలను తమదైన శైలిలో ఆలపించి ప్రేక్షకులను విశేషంగా అలరించారు.

కార్యక్రమానికి సత్యసంగీత్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఓంకార్ రాజు, శైలజ ఓంకార్, అంజనీ కుమారి పీవీపీ తదితరులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. అలనాటి నుంచి నేటి వరకు సంగీతాభిమానుల ఆదరణ పొందిన సినీ గీతాల ఆలాపనతో కళావేదిక సంగీతమయంగా మారింది.

గాయనీ గాయకుల మధుర గానానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలుగు–హిందీ సినీ సంగీత మాధుర్యాన్ని ఒకే వేదికపై ఆవిష్కరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. కార్యక్రమ నిర్వాహకుడు ఆనంద్ పాల్గొన్న అతిథులు, కళాకారులు, సంగీతాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →