గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX71,877-0.70%
NIFTY22,292-1.17%
22K₹1,37,846/10g-0.20%
భాషలు

తాజా వార్తలు

తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి ‎‎తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి

Deputy CM Bhatti Vikramarka and Minister Jupally Krishna Rao directed officials to develop a comprehensive action plan to position Telangana as a prominent national and international tourism destination.

nagendra24 September 2026, 7:19 PM3 చూసులుtrinetnews.com
తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి ‎‎తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

‎‎చారిత్రక కట్టడాల పరిరక్షణతో పాటు ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు

‎

‎పర్యాటక రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులు పెంచాలి

‎

‎పర్యాటక ప్రదేశాల అభివృద్ధితో పాటు ఉపాధి, ఆదాయ వనరులు సృష్టించాలి

‎

‎అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం

‎

పాల్గొన్న పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

‎

‎హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 24:

తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

‎పర్యాటక అభివృద్ధి అంటే పర్యాటక సాంస్కృతిక శాఖ కేవలం పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం మాత్రమే కాదని, తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయడం కూడా అందులో భాగమేనని డిప్యూటీ సీఎం

అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులు, ఉపాధి, ఆదాయ అవకాశాలను పెంచుతూ రాష్ట్ర పర్యాటక రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖల ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టులు, శాఖ పరిధిలోని ఆస్తుల వినియోగం, బడ్జెట్ కేటాయింపులు, ప్రైవేట్ పెట్టుబడులు, చారిత్రక కట్టడాల పరిరక్షణ, పర్యాటక బ్రాండింగ్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

‎ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, పర్యాటక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విస్తృతం చేయాలని, పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో కొత్త ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రభుత్వ నిధులపై మాత్రమే ఆధారపడకుండా పర్యాటక శాఖకు చెందిన ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. భవనాలు ఉన్న ఆస్తులు, ఖాళీ స్థలాలు, పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆదాయాన్ని సమకూర్చే విధంగా ఆస్తులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే చర్యలు చేపట్టాలని సూచించారు.

‎

‎టూరిజం ద్వారా తెలంగాణకు గ్లోబల్ గుర్తింపు

‎

‎తెలంగాణలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హిల్ టూరిజం తదితర విభాగాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పర్యాటక పటంలో నిలిపేలా విస్తృత స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌కు వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఆకర్షించేలా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయాలని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్టులు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలని సూచించారు.

‎

‎చారిత్రక సంపద పరిరక్షణకు ప్రభుత్వ మద్దతు

‎

‎రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతలో కీలక భాగమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రామప్ప వంటి చారిత్రక ప్రదేశాల్లో పరిరక్షణ, నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రభుత్వ సహకారం అందిస్తొమన్నారు. అదే సమయంలో కొత్త పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్రభుత్వ బాధ్యతగా చేపట్టాల్సిన పరిరక్షణ కార్యక్రమాలు, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టగల అభివృద్ధి ప్రాజెక్టుల మధ్య సమతుల్యత పాటించాలని అధికారులకు సూచించారు.

‎

‎‘తెలంగాణ దర్శిని’కి ప్రాధాన్యం

‎

‎విద్యార్థుల్లో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలపై అవగాహన పెంచేందుకు ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సమావేశంలో చర్చించారు. విద్యార్థులను చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా రాష్ట్ర వారసత్వంపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పర్యాటక రంగంపై చిన్న వయసు నుంచే ఆసక్తి పెంచడంతో పాటు భవిష్యత్ తరాలకు తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు వివరించారు.

‎

‎పెట్టుబడులకు అనుకూల వాతావరణం

‎

‎పర్యాటక ప్రాజెక్టులకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. లీజు విధానాలు, ప్రాజెక్టుల ఆర్థిక సాధ్యత, పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి అవసరమైన మార్పులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పర్యాటక, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి అవసరమైన చోట అన్ని శాఖల అధికారులతో ఉమ్మడి సమావేశాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్ణీత కాలవ్యవధిలో కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. పెట్టుబడులు, ఉపాధి, ఆదాయం పెరిగేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.  ఈ సమాజంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి, ఫైనాన్స్ ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ఫైనాన్స్ సెక్రటరీ స్నిగ్ధా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి

సెంట్రల్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలిగా భాగ్యలక్ష్మి .... - పార్టీ బలోపేతానికి కృషి : సిహెచ్ భాగ్యలక్ష్మి.... ట్రైనెట్ న్యూస్, హైదరాబాద్ అక్టోబర్ 07: బీజేపీ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ

మిగతా చదవండి →

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →