గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,286-0.13%
NIFTY22,486-0.31%
22K₹1,38,142/10g+0.05%
భాషలు

తెలంగాణ

గాంధీజీ జీవితం ప్రపంచానికే ఆదర్శం: ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ జీవితం ప్రపంచానికే ఆదర్శం ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (ట్రైనెట్ న్యూస్‌): భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించి, అహింసా మార్గంలో దేశానికి స్వేచ్ఛను అందించిన జాతిపిత మహాత్మా గాం

Staff Reporter2 October 2026, 12:37 PM11 చూసులుtrinetnews.com
గాంధీజీ జీవితం ప్రపంచానికే ఆదర్శం: ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

గాంధీజీ జీవితం ప్రపంచానికే ఆదర్శం

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (ట్రైనెట్ న్యూస్‌): భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించి, అహింసా మార్గంలో దేశానికి స్వేచ్ఛను అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం ప్రపంచానికే ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రీ త్యాగరాయ గానసభ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళావేదికలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘ఎందరో మహానుభావులు–మధుర స్మృతులు’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సభకు ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య నాళేశ్వరం శంకరం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వి.ఎస్‌. జనార్దనమూర్తి సభకు అధ్యక్షత వహించారు.

స్వర కేసరి శ్రీనాథరావు, గాయకుడు డి.ఎం.వి. సుబ్బారావు విశిష్ట అతిథులుగా, గానసభ పాలకమండలి సభ్యుడు బండి శ్రీనివాస్‌ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అహింస, సత్యాగ్రహం, శాంతి, సామరస్యం వంటి గాంధీజీ సిద్ధాంతాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని వక్తలు తెలిపారు. యువత మహాత్ముడి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గాంధీజీకి ఇష్టమైన గీతాలు, దేశభక్తి గేయాలతో నిర్వహించిన సంగీత కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →