గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,286-0.13%
NIFTY22,486-0.31%
22K₹1,38,142/10g+0.05%
భాషలు

తెలంగాణ

మహాత్మా గాంధీ ఆశయాలను పాటించడమే నిజమైన నివాళి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

హైద్రాబాద్ , ట్రైనెట్ న్యూస్, అక్టోబర్,2.జాతిపిత మహాత్మాగాంధీ హింసకు పాల్పడకుండా, శాంతి మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశం నుండి తరిమికొట్టారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

Staff Reporter2 October 2026, 7:43 AM13 చూసులుtrinetnews.com
మహాత్మా గాంధీ ఆశయాలను పాటించడమే నిజమైన నివాళి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైద్రాబాద్ , ట్రైనెట్ న్యూస్, అక్టోబర్,2.జాతిపిత మహాత్మాగాంధీ హింసకు పాల్పడకుండా, శాంతి మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశం నుండి తరిమికొట్టారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ 157 వ జయంతి ని పురస్కరించుకుని శుక్రవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ లోని ఎమ్ జి రోడ్డులో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ జీవితం మనందరికీ ఎంతో ఆదర్శప్రాయమైనదన్నారు.

గాంధీజీ మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి 'సత్యం', 'అహింస' అనే రెండు బలమైన ఆయుధాలను ఎంచుకున్నారని చెప్పారు. మహాత్మా గాంధీ ఆశయాలైన సత్యం, అహింస, శాంతి మార్గాలను మన జీవితంలో పాటించడమే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో కవాడిగూడా సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ పుష్పలత, హార్టికల్చర్ అధికారి రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, టి.మహేశ్వరి, కిరణ్మయి, డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్, కిషోర్, ఆంజనేయులు, నార్ల దీపక్ గుప్త, గణేష్, సతీష్, శేఖర్, ఆరీఫ్, ప్రేమ్, చంద్రప్రకాష్, జయరాజ్, అబ్బాస్, రాజు, విఠల్, అడ్డు తదితరులు ఉన్నారు.

*గాంధీ హాస్పిటల్ వద్ద*

జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతిని గాంధీ హాస్పిటల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై గాంధీ విగ్రహం వద్ద పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుర్మ హేమలత, పద్మారావు నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, అంబులెన్స్ సురేష్, కొత్తూరు వెంకట్, వెంకటరమణ, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, అంబికా, కౌసల్య, దుర్గ తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →