గురువారం8 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,199-0.25%
NIFTY22,394-0.72%
22K₹1,38,000/10g-0.06%
భాషలు

తెలంగాణ

రూ.813 కోట్ల పరిహారం తక్షణమే రైతులకు చేరాలి: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

రూ.813 కోట్ల పరిహారం తక్షణమే రైతులకు చేరాలి భూసేకరణ, పునరావాస చెల్లింపులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకే రూ.6 వేల కోట్లకు సీఎం హామీ భూములిచ్చే రైతుల పట్ల న్యాయబద్ధంగా, మానవీయంగా వ్య

Staff Reporter21 September 2026, 4:22 PM6 చూసులుtrinetnews.com
రూ.813 కోట్ల పరిహారం తక్షణమే రైతులకు చేరాలి: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రూ.813 కోట్ల పరిహారం తక్షణమే రైతులకు చేరాలి

భూసేకరణ, పునరావాస చెల్లింపులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకే రూ.6 వేల కోట్లకు సీఎం హామీ

భూములిచ్చే రైతుల పట్ల న్యాయబద్ధంగా, మానవీయంగా వ్యవహరించాలి

నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్,

సెప్టెంబర్‌ 21: భూసేకరణ, పునరావాసం పునర్వ్యవస్థీకరణకు ఇప్పటికే విడుదల చేసిన రూ.813 కోట్లను ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత రైతులకు అందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.

నిధులు విడుదలైనప్పటికీ అవి ప్రభుత్వ ఖాతాల్లోనే ఉండిపోవడం, మరోవైపు భూసేకరణ పూర్తికాక సాగునీటి ప్రాజెక్టులు నిలిచిపోవడం ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం–పునర్వ్యవస్థీకరణ పనులు, పరిహారం చెల్లింపుల పురోగతిపై సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్‌రాజ్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్‌ సుల్తానియా, భూసేకరణ కమిషనర్‌ శివకుమార్ ‌నాయుడు, జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు భూసేకరణ, పునరావాసం–పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రూ.3,101 కోట్ల విలువైన టోకెన్లు సమర్పించగా, ప్రభుత్వం రూ.2,504 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు సమావేశంలో వివరించారు. ప్రస్తుతం జిల్లా స్థాయిలో చెల్లింపులకు పెండింగ్‌లో ఉన్న రూ.813 కోట్లలో రూ.502 కోట్లు భూసేకరణ అధికారుల వద్ద, మరో రూ.311 కోట్లు జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్నట్లు తెలిపారు.

ఈ పరిస్థితిపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు విడుదలైన తరువాత అవి తప్పనిసరిగా భూములు కోల్పోయిన రైతులకు చేరాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని రైతులతో సంప్రదింపులు జరపడంతోపాటు అవార్డుల ప్రక్రియను పూర్తి చేసి పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు. “ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు భూములు కోల్పోయిన రైతులకు చేరాల్సిందే. ఏదైనా వాస్తవమైన కారణంతో చెల్లించడం సాధ్యం కాకపోతే, అందుకు గల కారణాన్ని స్పష్టంగా తెలియజేసి నిధులను తిరిగి ప్రభుత్వానికి పంపాలి. అంతేగానీ, నెలల తరబడి ఖాతాల్లో నిరుపయోగంగా ఉంచడానికి వీల్లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతులకు సంబంధించిన అవసరాల కోసం 2026లో రూ.6 వేల కోట్లు అందిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు నిధుల కొరతతో ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతోనే ఈ మొత్తాన్ని నీటిపారుదల శాఖ సాధారణ బడ్జెట్‌కు అదనంగా సమకూరుస్తున్నట్లు తెలిపారు.

రైతుల పట్ల మానవీయంగా వ్యవహరించాలి

భూములు కోల్పోతున్న రైతుల పట్ల అధికారులు న్యాయబద్ధంగా, మానవీయంగా వ్యవహరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. అవార్డులు జారీ చేసి, చెల్లింపులకు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరువాతే టోకెన్లు సమర్పించాలని స్పష్టం చేశారు. రైతుల భూములను తీసుకునే విషయంలో ప్రభుత్వం అన్యాయం చేయాలని కోరుకోవడం లేదు. చట్టపరమైన నిబంధనలు, నిర్దేశిత ప్రక్రియకు లోబడి సాధ్యమైనంత వరకు మార్కెట్‌ ధరలకు దగ్గరగా పరిహారం అందించాలి” అని మంత్రి పేర్కొన్నారు. అవార్డు ప్రకటించిన తరువాత కూడా పరిహారం చెల్లింపులు ఆలస్యమైన కేసుల్లో నిబంధనల ప్రకారం రైతులకు వడ్డీ చెల్లించాలని ఆదేశించారు. కోర్టు కేసులు, యాజమాన్య వివాదాల కారణంగా నిలిచిపోయిన భూసేకరణ కేసులన్నింటినీ ప్రత్యేకంగా నమోదు చేసి, అడ్వొకేట్‌ జనరల్‌తో చర్చించి వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలవారీగా సమస్యలపై సమీక్ష

నల్గొండ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, సిద్దిపేట, వికారాబాద్‌, జగిత్యాల, హనుమకొండ తదితర జిల్లాల్లో భూసేకరణకు ఎదురవుతున్న సమస్యలను మంత్రి జిల్లాలవారీగా సమీక్షించారు. నల్గొండ జిల్లాలోని చింతపల్లి రిజర్వాయర్‌, పెండ్లిపాక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, ఉదయసముద్రం, నెల్లికల్లు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో జాప్యంపై ఆరా తీశారు. ముఖ్యంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయిన తరువాత దాని ప్రయోజనాలు రైతులకు అందాలంటే పెండ్లిపాక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ భూసేకరణను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. “ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయినా, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు అవసరమైన భూసేకరణ పూర్తికాకపోతే పెట్టిన పెట్టుబడికి ఆశించిన ప్రయోజనం దక్కదు” అని మంత్రి హెచ్చరించారు.

భూసేకరణ ప్రక్రియలో రెండు, మూడు వారాల సమయాన్ని సాధారణ పరిపాలనా జాప్యంగా భావించవద్దని కలెక్టర్లకు సూచించారు. ప్రతి దశకు నిర్దిష్ట గడువు పెట్టుకొని సాధ్యమైనంత తక్కువ సమయంలో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

అనేక సాగునీటి ప్రాజెక్టుల ప్రధాన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, పంపిణీ కాలువలు, అనుసంధాన పనులు, కొద్దిపాటి భూసేకరణ పెండింగ్‌లో ఉండటంతోనే వాటి ఫలాలు రైతులకు అందడం లేదని మంత్రి తెలిపారు. అందువల్ల భూసేకరణ ప్రక్రియను అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు మాట్లాడుతూ, చెల్లింపులకు కేసులు పూర్తిగా సిద్ధమైన తరువాతే నిధులను కోరాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఖాతాల్లో నిరుపయోగంగా ఉండకుండా జాగ్రత్త వహించాలని, ఆర్థిక వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

గాయని పి.సుశీల ట్రస్ట్ కు రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సుశీల ఏర్పాటు చేసిన కళా కారులు సంక్షేమ ట్రస్ట్ కు ఆర్థిక సహాయం హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ అక్టోబరు 6: విఖ్యాత గాయని పి సుశీల కళా కారుల సంక్షేమం గురించి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు తెలంగాణ ప్రభుత్వం ఏభై లక్షల న

మిగతా చదవండి →

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

మిగతా చదవండి →